ఇస్రాయెల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తాప్సీ

ఇస్రాయెల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తాప్సీ

Published on Dec 10, 2014 8:50 PM IST

Taapsee
‘సాహసం’ సినిమా తర్వాత సొట్టబుగ్గల చిన్నది తాప్సీ తెలుగులో కనిపించలేదు. కేవలం తమిళ, హిందీ సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది. తాప్సీ బాలీవుడ్ లో చేసిన సినిమా ‘బేబీ’. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో తాప్సీ ఓ సీక్రెట్ రా ఏజెంట్ గా కనిపించనుంది. అందుకోసం తను ఇస్రాయెల్ కి చెందిన కర్వ్ మగ అనే మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకుంది.

ఈ సినిమాలో కథలో ఎక్కువగా ఇస్రాయెల్ కి సంబంధం ఉండడం, అలాగే తను సీక్రెట్ ఏజెంట్ కావడం వలన తను కూడా యాక్షన్ స్టంట్స్ చేయాల్సి రావడంతో ఈ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకుంది. ‘ఎ వెడ్నెస్ డే’, ‘స్పెషల్ 26’ సినిమాల దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ ‘బేబీ’ సినిమా 23 జనవరి 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాపసీ ఇది కాకుండా మరో హిందీ సినిమా రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు