
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం లింగ ప్రమోషన్స్ ఫుల్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో లింగ ప్రమోషన్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో గోల్డెన్ గర్ల్ గా పేరున్న సోనాక్షి సిన్హా సౌత్ సినిమాకి పరిచయం కానుంది. కానీ సౌత్ లో చేస్తున్న మొదటి సినిమాలో గ్లామరస్ రోల్ చేయకుండా ఓ డీ గ్లామర్ రోల్ చేస్తుంది.
సోనాక్షి సిన్హా తన పాత్ర గురించి చెబుతూ ‘స్వాతంత్ర్యం రాక ముందు వచ్చే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అందులో నేను రజినీకాంత్ ని ప్రేమించే అమ్మాయిలా కనిపిస్తాను. సింపుల్ గా కాస్త డీ గ్లామరైజ్ గా ఉంటుంది. నాకు సౌత్ లో టచ్ లేకపోయినా రజినీ గారి వల్ల చాలా కంఫర్టబుల్ గా ఫీలయ్యాను. సినిమా మొత్తం ఆయన నన్ను సపోర్ట్ చేసారని’ తెలిపింది. కె ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుష్క కూడా ఓ హీరోయిన్ గా కనిపించనుంది.

