‘లింగ’ విడుదలకు 10 కోట్లు కడుతున్న నిర్మాతలు

‘లింగ’ విడుదలకు 10 కోట్లు కడుతున్న నిర్మాతలు

Published on Dec 11, 2014 4:55 PM IST

lingaa
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా ‘లింగ’ సినిమాకు ఇప్పట్లో సమస్యలు తప్పెట్లు కనబడడం లేదు. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ పలువురు కోర్టులో కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులు విచారణలో ఉన్న కారణంగా శుక్రవారం మధ్యాహ్నంలోపు 10 కోట్లు రూపాయలను పూచికత్తుగా కట్టి సినిమాను విడుదల చేసుకోవచ్చని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశించిన మొత్తాన్ని కట్టడానికి నిర్మాతలు సిద్దమయ్యారు. దాంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. తర్వాత ఏమవుతుందో చూడాలి.

కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. ముందుగా ప్రకటించినట్లు రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ శుక్రవారం సినిమా అన్ని సెంటర్లలో విడుదలవుతుంది. ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తెలిపారు.

రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ప్రపంచవ్యాప్తంగా 2500 పైచిలుకు థియేటర్లలో మరికొన్ని గంటల్లో సినిమా విడుదలవుతుంది.

తాజా వార్తలు