
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘బెంగుళూరు డేస్’ రీమేక్ లో సిద్దార్ధ్, సమంత జంటగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేటెస్ట్ టాక్. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ వీరిద్దరని కలసి స్క్రిప్ట్ వినిపించగా, ఇద్దరికీ బాగా నచ్చిందట. వెంటనే తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంతకం చేశారని ప్రొడక్షన్ యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా త్వరలో వెల్లడిస్తారని చెప్తున్నారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ రెడీ చేసే పనిలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బిజీగా ఉన్నారు. జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తారు. సిద్దార్ధ్ తో పాటు మరో హీరోగా తమిళ నటుడు ఆర్యను ఎంపిక చేశారు. ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది.

