
సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ నటీనటులుగా మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘టైగర్’. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇటివలే వారణాసి(కాశి) షెడ్యూల్ ఇటివలే పూర్తి చేసుకుంది. ‘టైగర్’ సినిమాలో తాను గంగ పాత్రలో నటిస్తున్నాని సీరత్ కపూర్ తెలిపింది. వారణాసి షెడ్యూల్ లో తన అనుభవాలను చెప్పుకొచ్చింది.
నా మొదటి సినిమా ‘రన్ రాజా రన్’లో నేను పోషించిన పాత్రకు పూర్తి భిన్నంగా గంగ పాత్రలో ‘టైగర్’లో కనిపిస్తాను. సంప్రదాయబద్దమైన కుటుంబంలో పుట్టి పెరిగిన నిజాయితి గల అమ్మాయి ‘గంగ’, జీవితంలో చాలా ఆటుపోట్లుకు గురవుతుంది. ‘గంగ’ పాత్రలో నటించే సమయంలో కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదు. క్యారెక్టర్ లో ఎమోషన్ నాకు అంతలా కనెక్ట్ అయ్యింది. నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు చక్కని నటన కనబరిచే అవకాశం లభిస్తుంది. ఫోన్ కాల్స్ వలన డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక అర చేతి ప్రపంచానికి దూరంగా ఉన్నాను. అప్పుడే పాత్రకు 100 శాతం న్యాయం చేయగలను. అని సీరత్ కపూర్ తెలిపింది.

