యాక్షన్ హీరో సాయికుమార్ తనయుడు యంగ్ హీరో ఆది ఓ ఇంటివాడయ్యాడు. అక్టోబర్ లో రాజమండ్రికి చెందిన అరుణ అనే అమ్మాయితో ఆది నిశ్చితార్ధం జరిగింది. వీరిద్దరి పెళ్లి నిన్నే హైదరబాద్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకిఇండస్ట్రీ లోని పలువురు ప్రముఖులు మరియు పలువురు రాజకీయ నాయకులు వచ్చారు.
నిన్న సాయంత్రం హైదరబాద్ లోనే గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు. ఆ రిసెప్షన్ కిచిరంజీవి , అల్లు అర్జున్, రాజశేఖర్, గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్, శ్రీవాస్, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. తన నిశ్చితార్ధం తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ ‘సినిమా నటులకు పర్ఫెక్ట్ అమ్మాయి దొరకడం చాలా కష్టం. నా వరకూ మాత్రం అరుణ లాంటి అమ్మాయి నా పార్టనర్ గా దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని’ అన్నాడు. మరి ఈ అమ్మాయి ఆది లైఫ్ లో అదృష్టాన్ని తీసుకోస్తుందేమో చూడాలి..


