‘రఘువరన్ బిటెక్’ ట్రైలర్ కు అద్బుత స్పందన

‘రఘువరన్ బిటెక్’ ట్రైలర్ కు అద్బుత స్పందన

Published on Dec 16, 2014 10:33 AM IST

Raghuvaran-B.Tech

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత ధనుష్, ‘రఘువరన్ బిటెక్’ సినిమాతో మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన విఐపి సినిమాకు ఇది డబ్బింగ్ వెర్షన్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సినీ అభిమానులను ఆకట్టుకుంది.

సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన వెల్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. బిటెక్ చదివిన నిరుద్యోగి పాత్రలో ధనుష్ నటించారు. సినిమా థీమ్ సాధారణ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

వివాహం తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకున్న అమలా పాల్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తాజా వార్తలు