
సంచనల దర్శకులు రామ్ గోపాల్ వర్మ నిన్న ట్విట్టర్ లో పెద్ద తప్పు చేశారు. సీనియర్ దర్శకుడు బాలచందర్ వచ్చిన పుకార్లను నమ్ముతూ.. స్వర్గస్థులైన బాలచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో విలక్షణ దర్శకుడని కొనియాడారు. తర్వాత అసలు విషయం వర్మకు అర్ధమైంది. బాలచందర్ మరణ వార్త కేవలం పుకారు మాత్రమే అని తెలిసింది.
అవగాహనా రాహిత్యంతో తను చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. త్వరగా బాలచందర్ కోరుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. దురదృష్టకరమైన అంశం ఏంటంటే పలువురు నెటిజన్లు బాలచందర్ ఆరోగ్య పరిస్థితి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నా కోలుకుంటున్నారని కావేరి హాస్పిటల్ వైద్యులు ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు.

