ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నాగార్జున.

ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నాగార్జున.

Published on Dec 18, 2014 10:09 AM IST

Akkineni_Nageswara_Rao
కృష్ణా జిల్లా గుడివాడలో గల ఏఎన్‌ఆర్‌ కళాశాలలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ బుధవారం జరిగింది. నట సామ్రాట్ తనయుడు, ప్రముఖ హీరో కింగ్ నాగార్జున 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పలు రంగాలలో ప్రముఖ వ్యక్తులైన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, గోపాల కృష్ణ, జస్టిస్‌ పర్వత రావు, సంపత్‌ కుమార్‌, గోపిచంద్‌కు తదితరులకు అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డు మరియు గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నాన్నగారు ఎప్పుడూ మన మనస్సుల్లోనే ఉంటారు. మాపై ఇంత ప్రేమ, ఆదారాభిమానాలు చూపిస్తున్న అభిమానులు కృతజ్ఞతలు. అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమల అక్కినేని, అఖిల్, సుశాంత్ మరియు మంత్రి కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.

తాజా వార్తలు