
భారీ చిత్రాల శంకర్ మరో భారీ సృష్టి ‘ఐ’ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి 9న విడుదల కు సిద్దం కానుంది. ఇదిలావుండగా ‘ఐ’ తెలుగు వెర్షన్ టాలీవుడ్ లో ఎంతో సందడి సృష్టిస్తుంది. తాజా సమాచారం ప్రకారం వైజాగ్ మరియు గుంటూరు పంపిణీ హక్కులు 4 మరియు 3.6 కోట్లకు అమ్ముడయ్యాయి.
కృష్ణ హక్కులు 2. 25 కోట్లకి అమ్ముడవ్వగా తూర్పు గోదావరి హక్కులు 3 కోట్లకి అమ్ముడయ్యాయి. విక్రం అమీ జాక్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పి. సి. శ్రీరాం ఛాయాగ్రహణం అందించారు.

