అప్పుడు మహేష్ బాబుతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో..

అప్పుడు మహేష్ బాబుతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో..

Published on Dec 21, 2014 11:21 AM IST

venkatesh-mahesh-pawan
2014 సంక్రాంతికి మహేష్ బాబుతో కలసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో సందడి చేసిన విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తోడుగా తీసుకువస్తున్నారు. పవన్, వెంకీ కలసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమా జనవరి 9న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వరుసగా ఈ ఏడాది కూడా సంక్రాంతికి స్లాట్ బుక్ చేశాడు వెంకి.

ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అప్పుడూ ఇప్పుడూ ఇద్దరు యంగ్ స్టార్ హీరోలతో వెంకీ బైక్ పై ఉన్న స్టిల్స్ ను దర్శకనిర్మాతలు విడుదల చేయడం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఘన విజయం సాధించింది. తాజా ‘గోపాల గోపాల’పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పుడు మహేష్ బాబుతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో.. వెంకీ హిట్ రిపీట్ చేయబోతున్నాడు అనమాట. సంక్రాంతి రాజుగా అవతరించనున్నాడు.

తాజా వార్తలు