సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో వస్తున్న రాజమౌళి తండ్రి

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో వస్తున్న రాజమౌళి తండ్రి

Published on Dec 21, 2014 12:58 PM IST

rajmouli-father-neha-hinge
కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన ‘రాజన్న’ సినిమా తర్వాత మరోసారి దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, విజయేంద్ర ప్రసాద్ మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ‘రాజన్న’ సినిమాతో చారిత్రాత్మక కథను అద్బుతంగా తెరకెక్కించారని ప్రసంశలు అందుకున్నారు. ఈసారి కాస్త తన పంథాను మార్చారు. ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నారు.

ఇదొక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ (2010) నేహ హింగే ఎంపికైంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో నేహా హింగే ఎన్నారైగా నటిస్తుంది. తన పాత్రలో వైవిధ్యమైన నటన కనబరచడానికి ఆస్కారం ఉందని చెప్తుంది. షార్ప్ షూటర్ గా, ఫైటర్ గా కనిపించనుంది.

తాజా వార్తలు