‘గోపాల గోపాల’లో కైలాష్ ఖేర్ స్పెషల్ సాంగ్..

‘గోపాల గోపాల’లో కైలాష్ ఖేర్ స్పెషల్ సాంగ్..

Published on Dec 22, 2014 9:35 PM IST

kailash-kher
నార్త్ ఇండియన్ సింగర్ కైలాష్ ఖేర్ గాత్రంలో ఏదో తెలియని మాయ ఉంటుంది. బహుశా ఆ మేజిక్ అతనిని ప్రేక్షకులకు దగ్గర చేసింది. ‘అరుంధతి’లో ‘కమ్ముకున్న చీకట్లోనా..’ ప్రభాస్ ‘మిర్చి’లో ‘పండగలా దిగి వచ్చావు..’ పాటలతో తెలుగులో కూడా కైలాష్ ఖేర్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అతని స్వరం ఇక్కడి ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది.

తాజాగా పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’లో కైలాష్ ఖేర్ ఓ స్పెషల్ సాంగ్ పాడారు. ఎటువంటి ప్రశ్నలు సందించకుండా సమాజంలో జరిగే అంశాలను మనం అనుసరిస్తున్నాం. వాటి గురించి ఈ పాటలో చర్చించారు. కైలాష్ ఖేర్ పాడిన విధానం పట్ల దర్శకుడు డాలీ, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంతోషం వ్యక్తం చేశారు. పాట అద్బుతంగా వచ్చిందని తెలిపారు.

‘నేను చాలా పాటలు పాడాను. కానీ, ఇటువంటి పాటలు అరుదుగా వస్తాయి. నా మనసుకు దగ్గరైన పాట ఇది. ఇంటిలిజెంట్ సాంగ్. ఇటువంటి పాట పాడడంలో ఓ ఆత్మ సంతృప్తి ఉంటుంది’ అని కైలాష్ ఖేర్ అన్నారు.

వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్నారు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఓ మై గాడ్’ సినిమాకు రీమేక్ గా ‘గోపాల గోపాల’ రూపొందిస్తున్నారు.

తాజా వార్తలు