వేలానికి రజినీకాంత్ ఆస్తులు..

వేలానికి రజినీకాంత్ ఆస్తులు..

Published on Dec 26, 2014 3:30 PM IST

rajnikanth
ప్రముఖ హీరో, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఆస్తులు వేలం వేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ పేపర్‌ ప్రకటనలో ఎక్సిమ్‌ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ‘కొచ్చాడియన్‌’ సినిమా నిర్మాణానికి సంబంధించి మీడియావన్ సంస్థ ఈ బ్యాంకు నుండి 22 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. రజిని సతీమణి లత రజినీకాంత్ షూరిటీ సంతకం పెట్టారు. ఈ అప్పును తిరిగి చెల్లించకపోవడంతో సూపర్ స్టార్ దంపతుల ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే ఆస్తులు జప్తు చేసినట్టు సమాచారం.

రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ‘కొచ్చాడియన్‌’ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారి నష్టాలను కలిగించింది. అటు ప్రేక్షకులను కూడా ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అభిమానులను రంజింపచేయడం కోసం రికార్డు సమయంలో ‘లింగ’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేశారు. ప్రేక్షకులు ‘కొచ్చాడియన్‌’ను మర్చిపోయినా.. ఆ సినిమా నష్టాలు మాత్రం రజినీకాంత్ & కో ను వెంటాడుతూ ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు