
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. మొదరి సినిమాతోనే కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ తో చాన్స్ కొట్టేసిన శ్రీనివాస్ తన రెండవ సినిమా మాస్ పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ఆగష్టు 27న ప్రారంభమైన ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఫైనల్ గా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.
ఈ సినిమా షూటింగ్ అప్డేట్ గురించి మాట్లాడుతూ ‘ఇటీవలే నేను బోయపాటి శ్రీను గారు ఓ కథని ఫైనలైజ్ చేసాము. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలవుతుందని’ తెలియజేశాడు. బోయపాటి శ్రీను యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ సినిమాలో ఓ అగ్ర కథానాయిక నటించే అవకాశం ఉంది.

