జనవరి 10న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్..

జనవరి 10న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్..

Published on Jan 6, 2015 3:13 AM IST

Nani1
యువ హీరో నాని నటిస్తున్న తాజా సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జనవరి 10న విడుదల చేస్తున్నట్టు హీరో నాని తెలిపారు.

‘వినూత్న కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 36 మంది యూనిట్ సభ్యులు ఎవరెస్ట్ బేస్ క్యాంపులో సముద్రమట్టానికి 5300 మీటర్ల ఎత్తులో చిత్రీకరణ జరిపారు. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. అయితే అక్కడ చలికి తట్టుకోలేక 10 మంది మధ్యలో వెనుతిరిగగా, చివరి వరకూ 26 మంది ఉన్నారు. సగం పర్వత శ్రేణులలో, సగం నగరంలో ఈ సినిమా చిత్రీకరణ చేశాం. జనవరి 10న మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం.’ అని హీరో నాని సోషల్ మీడియాలో తెలిపారు.

రితు వర్మ, మలయాళ భామ మాళవిక నాయర్ నాని సరసన హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాకేశ్ – నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేస్తున్నారు. ఆడియో, సినిమా విడుదల తేదీలను జనవరి 10న ప్రకటించే అవకాశం ఉంది.

తాజా వార్తలు