జనవరి 21న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ఆడియో..!

జనవరి 21న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ఆడియో..!

Published on Jan 6, 2015 1:19 PM IST

Krishnamma-Kalipindi-Iddari
సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన విభిన్న ప్రేమ కథా చిత్రమ్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఆర్.చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హరి సంగీత దర్శకుడు. జనవరి 21న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకుడు చంద్రు చిత్రాన్ని అందమైన, మధురమైన ప్రేమ కావ్యంలా తెరకెక్కించారు. ఈ చిత్రంలో జోగ్ ఫాల్స్ అంచుల వద్ద చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలలో సుధీర్ బాబు రిస్కీ స్టంట్స్ చేశారు. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధి పాత్రలో నటించారు. ‘ప్రేమ కథా చిత్రమ్’ తర్వాత సుధీర్ బాబు, నందిత మరోసారి జంటగా నటించిన చిత్రమిది. కన్నడంలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి మాతృక. గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, కిషోర్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు