సుకుమార్ – తారక్ ల ప్రాజెక్ట్ లో రకుల్?

సుకుమార్ – తారక్ ల ప్రాజెక్ట్ లో రకుల్?

Published on Jan 7, 2015 1:09 AM IST

Rakul,-Sukumar,-ntr-Project
టెంపర్ ప్రీ రిలీజ్ బజ్ అందిస్తున్న జోష్ తో ఖుషీలో వున్న జూనియర్ ఎన్.టి.ఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్ తో ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ ప్రాజెక్ట్ ని లాంచనంగా ప్రారంభించినా తదుపరి సమాచారం ప్రకటించలేదు. అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక యువ తార పేరుని పరిశీలిస్తున్నారట.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కరెంట్ తీగ, లౌక్యం, జోరు సినిమాలతో అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ అయితే తారక్ సరసన అయితే దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. రకుల్ అయితే అన్నివిధాలుగా సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు