
చాలా రోజుల నుంచి మెగా అభిమానులను ఊరిస్తున్న మాట మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా… చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్నా ఈ సినిమాపై ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.. తాజాగా సౌత్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా డైరెక్ట్ చేయనున్నాడా.? అంటే అటు ఇటుగా అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తుంటే ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలానే ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం అన్నీ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై భారీగా అంచనాలు ఉంటాయి, ఆ అంచనాలను అందుకునేలా అందరికీ నచ్చేలా సినిమా తీయగల సత్తా ఉన్న డైరెక్టర్ శంకర్ అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పాత్ర చేయడానికి కూడా సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత శంకర్ – మెగాస్టార్ మూవీ గురించి తెలిసే అవకాశం ఉంది. మరి ఈ కాంబినేషన్ గురించి మీ అభిప్రాయం ఏమిటనేది కింద కామెంట్స్ రూపంలో తెలపండి..

