
ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న’పండగ చేస్కో’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గతంలో వచ్చిన రామ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవ్వడంతో ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ 10 కేజీల వెయిట్ తగ్గి స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.
రామ్ ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను రిచ్ ఎన్నారై కుర్రాడి పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. అవసరమైన పాయింట్ లో మాత్రమే మాట్లాడే పాత్ర, నా పాత్రలో డిఫరెంట్ కామెడీ షేడ్స్ కూడా ఉంటాయి. ఈ పాత్రలో స్లిమ్ అండ్ స్టైలిష్ గా కనిపించడం కోసం 10 కేజీల బరువు కూడా తగ్గానని’ అన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి వెలిగొండ శ్రీనివాస్ కథని అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. ఇది కాకుండా రామ్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం.

