
‘స్నేహ గీతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో సందీప్ కిషన్ కి మొదట్లో సోలో హీరోగా పెద్ద హిట్ రాలేదు. కానీ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సందీప్ కిషన్ మొదటి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘రారా కృష్ణయ్య’ కూడా బాక్స్ ఆఫీసు వద్ద బాగానే ఆడింది. ఈమధ్యనే వచ్చిన జోరు నిరాశాపరచడంతో సందీప్ కిషన్ ఓ వినూత్న కాన్సెప్ట్ తో చేసిన సినిమా ‘బీరువా’.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ బీరువా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దానికి కారణం కొత్తగా అనిపించే కథ, కథనంతో పాటు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని సందీప్ కిషన్ అంటున్నాడు. అలాగే సందీప్ కిషన్ బీరువా సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరవుతానని ఆశిస్తున్నాడు. కన్మణి దర్శకత్వం వహించిన ఈ సినిమాని రామోజీ రావు – జెమిని కిరణ్ కలిసి నిర్మించారు. సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

