
జనవరి 11న నెల్లూరులో జరగబోయే ‘సంక్రాంతి సంబరం’ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ అతిధిగా హాజరవుతున్నారు. జాతీయ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పుతున్న ప్రముఖ బిజెపి నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. తన స్వస్థలం నెల్లూరులో ఈ ‘సంక్రాంతి సంబరం’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ పండుగ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ కూడా వస్తున్నారు. గత ఎన్నికలలో ‘జనసేన’ రాజకీయ పార్టీని స్థాపించిన పవన్, బిజెపికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ తో కలసి పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘గోపాల గోపాల’, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మోడరన్ శ్రీకృష్ణుడిగా పవన్ కళ్యాణ్ అలరించనున్నారు. ఇటీవలే ఈ సినిమాలో పాటలు విడుదలయ్యాయి. వాటికి శ్రోతల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

