మార్చ్ 1 నుండి ‘బెంగళూరు డేస్’ రీమేక్ షూటింగ్.

మార్చ్ 1 నుండి ‘బెంగళూరు డేస్’ రీమేక్ షూటింగ్.

Published on Jan 8, 2015 3:18 PM IST

Siddharth-and-Samantha

మలయాళంలో ఘనవిజయం సాదించిన ‘బెంగళూరు డేస్’ సినిమాను తెలుగు, తమిళ భాషలలో పివిపి సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ఇక్కడ నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారని సమాచారం. మార్చ్ 1వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

సిద్దార్ద్, సమంత ఈ సినిమా తమిళ వెర్షన్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరొక హీరోను ఎంపిక చేయవలసి ఉంది. తెలుగు వెర్షన్లో సమంత నటించడం దాదాపు ఖాయమే. మిగతా నటీనటులను ఎంపిక ఇంకా పూర్తవలేదు. తాజాగా సిద్దార్ధ్, సమంత ప్రేమ విఫలమైందంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో నటించాలనే వారి నిర్ణయంలో మాత్రం మార్పు లేదంట. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి వృత్తిపరంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు