నిఖిల్ సినిమాకు కోన వెంకట్ కథ.

నిఖిల్ సినిమాకు కోన వెంకట్ కథ.

Published on Jan 8, 2015 5:33 PM IST

kona-venkat-nikhil

ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ త్వరలో యువ హీరో నిఖిల్ తో కలిసి వర్క్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిఖిల్ ‘సూర్య vs సూర్య’ సినిమాలో నటిస్తున్నారు. బహుశా ఈ సినిమా విడుదలయిన తర్వాత వీరిద్దరూ కలిసి పని చేసే అవకాశం ఉంది. వినూత్న కథలను ఎంపిక చేసుకుంటూ అభిమానుల ఆదరణ చూరగొంటున్న నిఖిల్, ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆకట్టుకున్నాడు.

ప్రతిసారీ తన సినిమాలు, కథల ఎంపికతో నిఖిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ‘సూర్య vs సూర్య’ ట్రైలర్ ఇంప్రెస్సివ్ గా ఉంది. క్రమంగా అతని మార్కెట్ మరియు ఆడియన్స్ బేస్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. అతి త్వరలో మేము ఇద్దరం కలిసి ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయబోతున్నాం. త్వరలో ఆ సినిమా వివరాలు వేల్లదిస్తాం. అని కోన వెంకట్ తన అఫీషియల్ పేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు