పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, విక్టరీ వెంకటేష్ అభిమానులు, సినీ అభిమానులు మరియు టాలీవుడ్ ప్రముఖులు ఎంతగానో ఎదురు చూస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలున్నాయి. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఎలాంటి కట్స్ విధించకుండా ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు.
సంక్రాంతి కానుకగా ‘గోపాల గోపాల’ సినిమాను జనవరి 10న విడుదల చేస్తున్నారు. యుఎస్ లో ఒక్క రోజు ముందు జనవరి 9న ప్రిమియర్ షోలు వేస్తున్నారు.
అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ‘గోపాల గోపాల’ మ్యూజిక్ ఆల్బంకి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.


