‘గోపాల గోపాల’ బెనిఫిట్ షోలకు పదుల సంఖ్యలో థియేటర్లు..

‘గోపాల గోపాల’ బెనిఫిట్ షోలకు పదుల సంఖ్యలో థియేటర్లు..

Published on Jan 9, 2015 3:10 AM IST

gopala-gopala-audio
ఎట్టకేలకు ‘గోపాల గోపాల’ సినిమా సెన్సార్ ముగించుకుని 10న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదలకు భారీ సంఖ్యలో థియేటర్ లను బ్లాక్ చెయ్యడమేకాకుండా బెనిఫిట్ షోకి పదుల సంఖ్యలో థియేటర్ లు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి 5 థియేటర్ లు 10వ తారీఖు తెల్లవారుజామున సినిమాను ప్రదర్శించేందుకు అనుమతిని పొందాయి

విశ్వనాద్, శ్రీ రాములు, విజేత, మల్లికార్జున మరియు భ్రమరాంబ థియేటర్ లు ఈ బెనిఫిట్ షోలకు బుకింగ్ లను మొదలుపెట్టాయి. ఈ షోలలో ఒక్కో టికెట్ ధర 300 నుండి 1000 వరకూ పలుకుతుంది.

సెన్సార్ ముగించుకుని క్లీన్ యు సర్టిఫికేట్ సంపాదించుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడ్రెన్ కృష్ణుడి పాత్రలో అభిమానులను అలరించనున్నాడు

తాజా వార్తలు