
పూజ సినిమాతో ఎప్పట్నుంచో ఆశిస్తున్న విజయాన్ని అందుకున్న విశాల్ ఈ పండగకి కూడా మన ముందుకురానున్నాడు. ఈసారి మరో యాక్షన్ ఎంటర్టైనర్ ‘మగమహారాజు’తో మనల్ని పలకరించనున్నాడు. ఈ సినిమా ఆడియో నేడు ఎన్ – కన్వెన్షన్ హైదరాబాద్ లో విడుదలకానుంది. విశాల్ తో సహా మిగిలిన చిత్రబృందం ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఈ సినిమా తమిళ వెర్షన్ ‘అంబాల’ జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలకానుంది. అయితే తెలుగు వెర్షన్ డేట్ ని ఇంకా ప్రకటించలేదు. జనవరి చివరికల్లా సినిమాను మనముందుకు తీసుకొచ్చే అవకాశాలు వున్నాయి.
ఈ సినిమాను సుందర్ సి తెరకెక్కించారు. హిప్ హాప్ తమిజ్హా సంగీత దర్శకుడు. విశాల్ సరసన హన్సిక నటించింది. విశాల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమాలో వైభవ, ప్రభు, మధురిమ, మాధవి లత మరియు రమ్యకృష్ణలు ముఖ్యభూమికలు పోషించారు

