2015లో బాక్స్ ఆఫీసు షేక్ చేయటానికి సిద్దమైన అల్లు అరవింద్

2015లో బాక్స్ ఆఫీసు షేక్ చేయటానికి సిద్దమైన అల్లు అరవింద్

Published on Jan 8, 2015 10:30 PM IST

allu-arvind
టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్స్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.. గీత ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ నిర్మాతగా 2015లో ఫుల్ బిజీ గా కానున్నాడు. వరుసగా తన సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సంవత్సరం అల్లు అరవింద్ సుమారు 6 సినిమాలను తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అంతే కాకుండా కొత్త వారిని పరిచయం చేస్తూ స్మాల్ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.

ఇప్పటికే అల్లు అరవింద్ మారుతి, ఈటీవీ ప్రభాకర్ మరియు పరశురాం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది కాకుండా పలు సినిమాల కథలను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలన్నీ నిర్మించడంలో మరో బ్యానర్ కూడా గీత ఆర్ట్స్ తో కలవనుంది. అలాగే తమిళంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న డార్లింగ్ సినిమా కూడా త్వరలో రిలీజ్ కి సిద్దమవుతోంది. ఈ అరడజను సినిమాలను అరవింద్ గారు ఏయే హీరోలతో ప్లాన్ చేస్తారు అనే విషయాల కోసం మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి..

తాజా వార్తలు