జనవరి 20 కల్లా పూర్తి కానున్న ‘టెంపర్’ టాకీ పార్ట్

జనవరి 20 కల్లా పూర్తి కానున్న ‘టెంపర్’ టాకీ పార్ట్

Published on Jan 9, 2015 3:57 PM IST

Temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. న్యూ ఇయర్ కానుకగా ఎన్.టి.ఆర్ తన అభిమానుల కోసం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసాడు. ఈ టీజర్ కి అభిమానుల నుంచి, సినీ ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరబాద్ లో జరుగుతోంది. ఎన్.టి.ఆర్ రోజూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ జనవరి 20 కల్లా పూర్తి కానుంది. టాకీ పార్ట్ కాకుండా ఈ సినిమాలో ఒక్క పాట మాత్రమే బాలన్స్ ఉంది. జనవరి 20పైన ఆ సాంగ్ షూట్ ని కూడా ఫినిష్ చేస్తారు. ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలేజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడియో లాంచ్ జనవరి 18న జరగనుంది.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు