సంక్రాంతి రారాజుగా విక్టరీ వెంకటేష్..!

సంక్రాంతి రారాజుగా విక్టరీ వెంకటేష్..!

Published on Jan 10, 2015 10:30 AM IST

Gopala-Gopala-(3)
వైవిధ్యమైన కథలు, వరుస విజయాలతో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్, తెలుగు చిత్ర సీమలో సరికొత్త సంక్రాంతి రారాజుగా అవతరించారు. గత సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా, ఈ సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. శనివారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్బుత స్పందన లభిస్తుంది. ఈ రెండు సినిమాలు మల్టీస్టారర్స్ కావడం విశేషం, రెండిటిలో వెంకటేష్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. తన నటనతో సినిమాకు సరికొత్త శోభ తీసుకొచ్చిన విక్టరీ వెంకటేష్, ప్రేక్షకుల నుండి ప్రసంశలు అందుకున్నారు.

ఒకవైపు సోలో హీరోగా ‘దృశ్యం’ వంటి సినిమాలలో నటిస్తూ… మంచి కథలు వచ్చినప్పుడు మల్టీస్టారర్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తన వయసుకు, ఇమేజ్ కు తగ్గ కథలను ఎంపిక చేసుకుంటూ హుందాగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. వెంకటేష్, ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే.. ఆ సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకులలో ఏర్పడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త తరహా సినిమాలకు నాంది పలికిన ఈ హీరోకు హాట్సాఫ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు