
సూర్య నటించిన సింగం సిరీస్ మరోసారి మనల్ని అలరించడానికి సిద్ధపడుతుంది. స్క్రిప్ట్ పనులు పూర్తిచేసుకున్న దర్శకుడు హరి తన కధాకధనంపై ఎంతో నమ్మకంగా వున్నాడు. తమిళ మరియు తెలుగు భాషలలో మొదటి రెండు సిరీస్ లు సూపర్ హిట్ అయిన నేపధ్యంలో మూడవ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడనున్నాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘మాస్’ సినిమా పూర్తవగానే ఈ చిత్రం పట్టాలేక్కనుంది
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మాస్ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. నయనతార, ప్రణీత హీరోయిన్స్. ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధపడుతుంది

