శ్రియ శరన్… పదేళ్లుగా తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. వయసు పెరిగినా వన్నె తరగని అందం శ్రియ సొంతం. కొద్ది కాలం గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలలో బిజీ అయిన శ్రియ, సీనియర్ హీరోలకు లక్కీ మస్కట్ గా మారింది. వరుస విజయాలతో ఆమెను అందరూ గోల్డెన్ గర్ల్ గా అభివర్ణిస్తున్నారు.
అక్కినేని త్రయం నటించిన ‘మనం’లో నాగార్జున సరసన శ్రియ నటించింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా మధురమైన విజయం సాధించింది. తాజాగా సంక్రాంతి కానుకగా నేడు విడుదలైన ‘గోపాల గోపాల’ సినిమాలో వెంకీ సరసన గృహిణిగా నటించింది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుండి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది.
గత ఏడాది నాగార్జునతో, ఇప్పుడు వెంకీతో సూపర్ హిట్స్ కొట్టిన శ్రియను విశ్లేషకులు సీనియర్ హీరోలకు లక్కీ మస్కట్ గా అభివర్ణిస్తున్నారు. ఇకపై, శ్రియకు తెలుగులో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది.


