మల్టీ స్టారర్ ల స్టార్ గా మారిన డాలీ

మల్టీ స్టారర్ ల స్టార్ గా మారిన డాలీ

Published on Jan 10, 2015 11:30 PM IST

dolly-director
కిషోర్ పార్ధసాని(డాలీ) తన మూడవ సినిమాతోనే తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపుని సొంతంచేసుకున్నాడు. పవన్, వెంకీ వంటి బడా స్టార్లను స్క్రీన్ పై సమతూకంగా చూపించగలగడంలో విజయం సాధించాడు. ముఖ్యంగా పవన్ చెరిష్మా తగ్గకుండా, స్క్రిప్ట్ కి చిల్లులు పెట్టకుండా కృష్ణుడి పాత్ర డిజైన్ చేసిన తీరు అభినందనీయం

‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమైన డాలీ ఆ తరువాత తమిళ సూపర్ హిట్ వెట్టాయ్ ని ‘తడాఖా’గా మనకు అందించాడు. కెరీర్లో డల్ ఫేజ్ లో వున్న చైతు, సునీల్ లకు ఈ సినిమా బాగా ఉపయోగపడింది. మల్టీస్టారర్ లను హ్యాండిల్ చెయ్యగలడనే నమ్మకంతో అతని చేతిలో ‘గోపాల గోపాల’ ప్రాజెక్ట్ వుంచడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నిర్మాతలు డాలీ వైపు మగ్గు చూపడం సర్వసాధారణం. మరి తన తదుపరి సినిమా కూడా మల్టీ స్టారర్ ఏ వుంటుందా లేదా అన్నది చూడాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు