తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీ

తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీ

Published on Jan 11, 2015 12:27 PM IST

NTR_Sukumar1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేస్తున్న ‘టెంపర్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిసెంబర్ లో లాంచ్ అయిన ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. డైరెక్టర్ సుకుమా పుట్టిన రోజు ఈ రోజు, ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్.టి.ఆర్ సినిమా గురించి ఆసక్తి కరమైన విషయాలను తెలిపాడు.

‘ఎన్.టి.ఆర్ సినిమా తండ్రీ – కొడుకుల మధ్య అనుబంధం నేపధ్యంలో సాగే సినిమా అని’ సుకుమార్ తెలిపాడు. అలాగే ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా అనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రతి సినిమాలోనూ తన హీరోని డిఫరెంట్ గా చూపించే సుకుమార్ ఇందులో ఎన్.టి.ఆర్ ని కూడా ఓ డిఫరెంట్ లుక్ లో చూపించే ఆలోచనలో ఉన్నారు. ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. టెంపర్ షూట్ ఫినిష్ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. టెంపర్ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సుకుమార్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు