
కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల చేత యూనివర్సల్ స్టార్ అనిపించుకున్న హీరో కమల్ హాసన్. తాజాగా కమల్ హాసన్ మరో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకోనున్నారు. సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోషియేషన్ వారు ఇండియన్ సినిమాకి ఎంతో సేవలందించిన ఫిల్మ్ మేకర్ కమల్ హాసన్ కి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వనున్నారు. ఈ ఈ 10వ ఎస్.ఐ.సి.ఎ అవార్డు వేడుకలు ఈ నెల 10న మలేసియాలోని కౌలా లాంపూర్ లో జరగనుంది.
ఈ వేడుకకి సౌత్ ఇండియన్ నుంచి పలువురు ప్రముఖులు హాజరవ్వడమే కాకుండా హిందీ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ విషయంలో తన వంతుగా ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి నాకు సపోర్ట్ ఇచ్చిన అభిమానులకి నా స్పెషల్ థాంక్స్. అలాగే ఎస్.ఐ.సి.ఎ వాళ్ళు టం ఆర్గనైజేషన్స్ ద్వారా సినిమాటోగ్రాఫర్స్ యొక్క ఫ్యామిలీ మరియు చిల్డ్రన్స్ కి డొనేషన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది.

