
వరల్డ్ పోర్న్ హీరోయిన్ అయిన హాట్ లేడీ సన్నీ లియోన్ హిందీ మూవీ ‘జిస్మ్’ తో ఇండియన్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న సన్నీ లియోన్ కి ప్రస్తుతం నార్త్, సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉంది. సనీ లియోన్ ఇటీవలే మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయ్యింది. తెలుగు కంటే ముందు తమిళంలో కనిపించింది. అంతే కాకుండా హైదరాబాద్ లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో కూడా పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దీంతో సన్నీ లియోన్ సౌత్ ఇండియన్ హాట్ ఫేవరైట్ గా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ భామని కన్నడ సినిమా ‘డీకే’ లో ఓ స్పెషల్ సాంగ్ చెయ్యడానికి ఎంపిక చేసారు. త్వరలోనే ఈ సాంగ్ ని షూట్ చేయనున్నారు. ఇది కాకుండా తెలుగు, తమిళ, కన్నడ నిర్మాతలు వాళ్ళ సినిమాల్లో సన్నీ లియోన్ తో స్పెషల్ సాంగ్స్ చేయించడానికి లేదా ఒక స్పెషల్ రోల్ చేయించడానికి ఆసక్తి చూపుతున్నారు. దానివల్ల ఆ సినిమాలకి స్పెషల్ క్రేజ్ వస్తుందని వారు ఆశిస్తున్నారు.

