
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘గోపాల గోపాల’ సినిమా జనవరి 10న రిలీజ్ అయ్యి అభిమానులకి మూడు రోజుల ముందే సంక్రాంతిని తీసుకు వచ్చింది. ఈ సినిమాకి ఫ్యాన్స్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అన్ని చోట్లా కలెక్షన్స్ వరశం కురిపిస్తోంది. కేవలం తెలుగు నాటే కాకుండా ఓవర్సీస్ లో కూడా మొదటి రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. మూడు రోజుల్లో 1 మిలియన్ డాలర్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొదటి రెండు రోజుల్లో గోపాల గోపాల సినిమా $585 వేల డాలర్స్ కలెక్ట్ చేసింది. మన ఇండియన్స్ కరెన్సీ ప్రకారం సుమారు 3 కోట్ల 65 లక్షలు.
ఓవర్సీస్ రిపోర్ట్ (93 లోకేషన్స్)
శనివారం – $ 281,000
ఆదివారం – $ 304,000
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించడమే ఈ సినిమాకి పెద్ద పల్స్అయితే , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అంతకన్నా పెద్ద ప్లస్ అవ్వడంతో ఆడియన్స్ సినిమా చూడటానికి మరింత ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాకి సంక్రాంతి సీజన్ కూడా తోడవడంతో మొదటివారం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

