
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవలే మహేష్ బాబు – పూర్ణలపై వచ్చే ఓ సాంగ్ ని షూట్ చేసారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు తన సినిమా శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాత పరమ్ వి పొట్లూరి పివిపి బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఈ సినిమాకి ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తారు. గతంలో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసాడు.

