అమెరికాలో ఇరగదీస్తున్న ‘గోపాల గోపాల’..!

అమెరికాలో ఇరగదీస్తున్న ‘గోపాల గోపాల’..!

Published on Jan 12, 2015 11:59 AM IST

Gopala-Gopala-(3)

విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమా అమెరికాలో మంచి వసూళ్లను రాబడుతుంది. తొలి రెండు రోజుల్లో 3.75 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. జనవరి 10న విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోలను జనవరి 9వ తేదీన ప్రదర్శించారు. శుక్రవారం మరియు శనివారాలలో 600k డాలర్లను వసూలు చేసినట్టు యు.ఎస్.ఏ పంపిణిదారులు తెలిపారు. త్వరలో మిలియన్ మార్క్ చేరుకోనుందని చెప్పారు.

ఇండియాలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ‘గోపాల గోపాల’ టాప్ 3లో ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సెలవులు మరో నాలుగు రోజులు ఉండడంతో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కూడా టాప్ 5లో చోటు దక్కించుకోవడం ఖాయమని చెప్తున్నారు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడం ఓ విశేషం. ముఖ్యంగా ఈ సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా చక్కని నటనతో అలరించిన పవన్ కళ్యాణ్ ను అందరూ ప్రసంశిస్తున్నారు. డాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. వెంకటేష్ సరసన శ్రియ నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు