
ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ‘దొంగ దొంగ’ సినిమాలో టైటిల్ ట్రాక్ ని ఒక చిన్న పిల్లాడు పాడాడు గుర్తుందా? ఆ గొంతు మరెవరిదో కాదు రెహమాన్ మేనల్లుడు, ప్రస్తుత యువ సంగీత దర్శకుడు అయిన జీవి ప్రకాష్ కుమార్ ది. జీవి సకలకళావల్లభుడు. ఒకవైపు సింగింగ్ మరో వైపు మ్యూజిక్ డైరెక్షన్ ఇంకో వైపు సినిమాలో హీరో పాత్రలతో కనువిందు చేస్తున్నాడు. అవును ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన జీ.వి ఈ పండగకి ఒక తెలుగు రీమేక్ చిత్రంతో తమిళంలో సందడి చెయ్యనున్నాడు
మొదట్లో జీ.వి నటించాలని కోరిక లేకపోయినా మురగదాస్ ఒక సినిమాకోసం నటించమని కోరారట. అయితే అనుకోని కారణాల నడుమ ఆ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తరువాత ఒక వెరైటీ కాన్సెప్ట్ తనదగ్గరకు రావడంతో ‘పెన్సిల్’ అనే ప్రాజెక్ట్ లో హీరోగా నటించేందుకు అంగీకరించాడు. అయితే ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే వుంది. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా నన్ను చూసి మీకు మీసం, గడ్డం బాగున్నాయి, నేనొక తెలుగు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాను, అందులో హీరోగా మీరు బాగుంటారు, ఆ సినిమా సీడీ పంపిస్తాను చూడండి అని చెప్పారు. అలా నా హీరో కెరీర్ డార్లింగ్ సినిమాతో మొదలైంది” అని తెలిపారు. డార్లింగ్ సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన ప్రేమ కథా చిత్రానికి రీమేక్.

