పవర్ స్టార్ కి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే పనిలో డాలీ

పవర్ స్టార్ కి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే పనిలో డాలీ

Published on Jan 13, 2015 8:21 AM IST

dolly
డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని అలియాస్ డాలీ తాజాగా ‘గోపాల గోపాల’ సక్సెస్ తో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ తో ఎంతో మంది నిర్మాతలు తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ డాలీ తన తదుపరి సినిమా ఎవరితో అనేది ఫిక్స్ అయిపోయాడు. డాలీ తన నెక్స్ట్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే ఉంటుందని అనౌన్స్ చేసాడు. అలాగే త్వరలోనే స్క్రిప్ట్ కూడా రెడీ చేయనున్నానని తెలిపాడు.

ప్రస్తుతం గోపాల గోపాల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ప్రమోషనల్ ఈవెంట్స్ లో బిజీగా ఉన్న డాలీ జనవరి చివరికల్లా పవన్ కళ్యాణ్ మూవీ స్క్రిప్ట్ ని మొదలు పెడతాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అధికారికంగా తన నెక్స్ట్ మూవీ డాలీ చేస్తాడని మాటిచ్చాడు. ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యి పవన్ కళ్యాణ్ ఓకే అన్న తర్వాత ఈ సినిమా నిర్మాతల గురించి తెలిసే అవకాశం ఉంది. దీని ప్రకారం డాలీకి ముందుముందు టాలీవుడ్ లో ఆసక్తికరమైన కెరీర్ ఉందని ఆశించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు