ప్రెగ్నెన్సీ పుకార్లను ఖండించిన అమల పాల్

ప్రెగ్నెన్సీ పుకార్లను ఖండించిన అమల పాల్

Published on Jan 13, 2015 4:29 PM IST

amala-paul

తమిళ దర్శకుడు ఏయల్ విజయ్ ను వివాహం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ అమలా పాల్.. ప్రెగ్నెన్సీ పుకార్లను ఖండించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అమలా పాల్ గర్భవతి అంటూ ఒక వార్తను ప్రచురించింది. దీనిపై అమలా పాల్ ట్విట్టర్లో స్పందించింది.

‘మీడియాలో ప్రస్తుతం నేను ప్రెగ్నెన్సీతో ఉన్నట్టు ప్రచారం చేస్తుంది, అది నిజం కాదు. ఈసారి క్రిస్మస్ ను మరింత ఎంజాయ్ చేశాను. కాస్త నచ్చిన ఫుడ్ లాగించడం వలన బేబీ బంప్ వచ్చినట్లు కనపడింది. మరోసారి అభిమానులను నిరాశ పరిచినందుకు సారీ. ఒక మీడియా సంస్థ ఇలా ప్రచారం చేయడం రెండవ సారి. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దాచుకోవలసిన అవసరం నాకు లేదు’ అని అమలా పాల్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

తాజా వార్తలు