
కమర్షియల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నా విజువల్ వండర్ ‘ఐ’. ఈ ‘ఐ’ సినిమా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది. దానికి కారణం ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుండడం.. సుమారు 20,000 స్క్రీన్స్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన అద్భుతమైన విజువల్స్, విక్రమ్ గెటప్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే విక్రమ్ – శంకర్ ఫ్యాన్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే కొంతమంది సినిమా లవర్స్ మాత్రం ఈ సినిమా అంతగా ఉండకపోవచ్చని పెదవి విరుస్తున్నారు.
తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఎంటర్ టైన్మెంట్ చూడటానికి ఇష్టపడతారు. అలాగే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ కి ఎంటర్ టైన్మెంట్ జోడించి చెబితే ఇంకా బాగానే కనెక్ట్ అవుతారు. అలాగే శంకర్ కూడా మొదటి సారి ఓ ప్రయోగాత్మక సినిమాతో మన ముందుకు రానున్నాడు. అందుకే విజువల్స్ పరంగా బాగానే ఉన్నా సినిమా ఏమైనా తేడాగా ఉంటుందేమో అని అంటున్నారు. కొంతమంది సినిమా అస్సలు మెప్పించేలా ఉండదు అని కొందరు అంటుంటే కొందరు మాత్రం శంకర్ నిరుత్సాహపరచడు అని అంటున్నారు. మరి ‘ఐ’ పొజిషన్ ఏంటనేది మరి కొన్ని గంటల్లో తెలుస్తుంది.

