
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాటి హిట్ పట్టాలెక్కి ఆ తరువాత రెండు వరుసపరాజయాలతో సేఫ్టీ జోన్ లో పడ్డ యువహీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రెండు సినిమాలతో మనల్ని అలరించనున్నాడు. సందీప్ నటించిన ‘బీరువా’ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. అయితే ఈరోజు సందీప్ మరో ప్రాజెక్ట్ ”టైగర్” టీజర్ ని విడుదలచేశారు
సందీప్, రాహుల్ రవీంద్రన్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా కాశీ నగరం నేపధ్యంలో ఎంటర్టైనర్ గా సాగనుంది. టీజర్ లో సందీప్ పలికిన డైలాగుకి మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఈ టీజర్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమన్ సెకండ్ ఇన్నింగ్స్ కి ఇది సరైన సినిమా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో శీరత్ కపూర్ హీరోయిన్. వి.ఐ ఆనంద్ దర్శకుడు

