సంక్రాంతి కానుకగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఫస్ట్ టీజర్

సంక్రాంతి కానుకగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఫస్ట్ టీజర్

Published on Jan 14, 2015 4:15 PM IST

subhramanyam-for-sale

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. మాస్ ని ఆకట్టుకునే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది.

సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఇండియాలోని పలు ప్రాంతాల్లో షూట్ చేయనున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ని ఏప్రిల్ లో అమెరికాలో షూట్ చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు