డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘టెంపర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ బిజీ షెడ్యూల్ లో కూడా కాస్త ఖాళీ టైం కుదిరినప్పుడు పూరి జగన్నాధ్ పలు సినిమాలకు వాయిస్ ఓవర్, పలు సినిమాలకు సంబందించిన ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. వరుణ్ సందేశ్ – వితిక షేరు నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘పడ్డానండి ప్రేమలో మరి’. ఈ సినిమా ట్రైలర్ ని పూరి జగన్నాధ్ లాంచ్ చేసాడు.
మహేష్ ఉప్పుతూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ట్రైలర్ లాంచ్ చేసిన పూరి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఆడియో జనవరి 22న జరగనుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


