అందరినీ ఆకట్టుకునేలా ‘ఎవడే సుబ్రమణ్యం’ ట్రైలర్

అందరినీ ఆకట్టుకునేలా ‘ఎవడే సుబ్రమణ్యం’ ట్రైలర్

Published on Jan 15, 2015 5:26 PM IST

Yevade-Subramanyam

యంగ్ హీరో నాని వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ బిజీబిజీగా ఉన్నాడు. చాలా రోజుల క్రితమే నాని షూటింగ్ మొదలు పెట్టి ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా అప్పుడే చివరి దశకు చేరుకుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని సంక్రాంతి కానుకగా ‘ఐ’ సినిమాతో పాటు థియేటర్స్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ రొటీన్ కి కాస్త భిన్నంగా ఉండడం మరియు మునుపెన్నడూ షూట్ జరగని హిమాలయాల్లో ఈ సినిమా షూట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

తన లైఫ్, ఫ్రెండ్షిప్ మరియు లవ్ గురించి తెలుసుకోవడానికి ఓ కుర్రాడు మొదలు పెట్టె జర్నీలో తనకు ఎదురైన అనుభవాలు తనని ఎలా మార్చాయి అనేదే ఈ సినిమా కథాంశం. శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’ ఫేం రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాళవిక నాయర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. గతంలో ‘స్టూడెంట్ నెం.1’ లాంతో సూపర్ హిట్ మూవీని అందించిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న – ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు