వివాదం పై ప్రకాశ్‌రాజ్‌ క్లారిటీ !

వివాదం పై ప్రకాశ్‌రాజ్‌ క్లారిటీ !

Published on Apr 19, 2026 12:55 PM IST

నటుడు ప్రకాశ్‌రాజ్‌ శ్రీరాముడిపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ప్రకాశ్ రాజ్ తాను చేసిన కామెంట్స్ పై స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘ఇటీవల నేను ఓ సాహితీ కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారు. నేనేదో అవతారపురుషుడు శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానని నా పై ప్రచారం చేస్తున్నారు.

కానీ, ఆ ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదు. అయినా, అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. కొందరు రాజకీయ నాయకులు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక.. నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిని నేను పట్టించుకోను. నాకు న్యాయం అనిపించిన ప్రతి అంశం పై నేను పోరాడతాను’ అని ప్రకాశ్‌రాజ్‌ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు