18కోట్లు కలెక్ట్ చేసిన గోపాల గోపాల

18కోట్లు కలెక్ట్ చేసిన గోపాల గోపాల

Published on Jan 16, 2015 8:00 AM IST

gopala-gopala
సంక్రాంతి పపండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు నటించిన ‘గోపాల గోపాల’ మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. కుటుంబ సమేతంగా సినిమాను చూడగలగడం, పాన్ చెరిష్మా సినిమాకు తోడవ్వడం, ఈ చిత్రానికి కాంపిటీటర్ గా నిలుస్తుందనుకున్న శంకర్ ‘ఐ’ నిరాశపరచడంతో ‘గోపాల గోపాల’కు ప్లస్ అయ్యింది

ముఖ్యంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు హౌస్ ఫుల్ షోలతో థియేటర్ ల దగ్గర కళకళలాడుతుంది. గత శనివారం విడుదలైన ఈ మల్టీ స్టారర్ సినిమా 18కోట్లను సంపాదించిపెట్టింది. ఈ కలెక్షన్ కేవలం ఆంద్ర, తెలంగాణాలో మాత్రమే కావడం మరో విశేషం. అనూప్ రూబెన్స్ స్వరపరించిన ఈ చిత్ర సంగీతానికి మంచి ప్రశంసలు అందుతున్నాయి. డాలీ దర్శకత్వం వహించాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు