
నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘పటాస్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిఎన్మా జనవరి 23న థియేటర్స్ లో సందడి చేయనుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు అభిమానుల్లో ఈ సినిమాకి క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని సమాచారం. కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాడని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమాకి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ పటాస్ విజయం పై చాలా నమ్మకంగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

